Amit Shah: అమిత్ షాకు చంద్రబాబు, నారా లోకేశ్ బర్త్ డే విషెస్

Amit Shah Receives Birthday Wishes from Chandra Babu Naidu Nara Lokesh
  • నేడు అమిత్ షా బర్డ్ డే
  • సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ చెప్పిన చంద్రబాబు, లోకేశ్
  • దేశ వ్యాప్తంగా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు, నాయకులు  
భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

"హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్‌ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవలో మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే మంత్రి నారా లోకేశ్‌ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, "అమిత్‌ షా గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేశ పాలన, జాతీయ భద్రత పట్ల మీ అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. మీకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను" అని తన సందేశంలో పేర్కొన్నారు.

జన్మదినం సందర్భంగా అమిత్‌ షాకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
Amit Shah
Chandra Babu Naidu
Nara Lokesh
Birthday Wishes
BJP Leader
Union Home Minister
Andhra Pradesh
Political News

More Telugu News