Chandrababu: యూఏఈ పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

Chandrababu Embarks on UAE Tour
  • ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్ర‌బాబు మూడు రోజుల యూఏఈ పర్యటన
  • పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో, తెలుగు డయాస్పొరా సమావేశాల్లో పాల్గొననున్న సీఎం
  • విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్న చంద్ర‌బాబు
  • యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ
సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకి బయలుదేరుతారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. 

అలాగే ఓ సైట్ విజిట్ చేస్తారు. ఈ సైట్ విజిట్‌లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. ఈరోజు మొత్తంగా ఐదు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. వ‌చ్చే నెల‌ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. 

ఇక‌, పర్యటన చివరి రోజున దుబాయ్‌లో ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్య‌మంత్రి సమావేశం అవుతారు. వీరితో ముఖాముఖి భేటీ కానున్నారు.
Chandrababu
UAE tour
Andhra Pradesh
Partnership Summit
Visakhapatnam
Dubai Future Museum
CII Partnership Summit
APNRT
Telugu Diaspora
Industrialists

More Telugu News