ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ గడువు.. 150కి పైగా నామినేషన్లు
- నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసిన నామినేషన్ గడువు
- గేటు లోపల ఉన్న వారికి నామినేషన్ వేయడానికి అవకాశం
- బరిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు
ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.