Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ గడువు.. 150కి పైగా నామినేషన్లు

Jubilee Hills Bypoll Nomination Deadline Ends Over 150 Nominations Filed
  • నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసిన నామినేషన్ గడువు
  • గేటు లోపల ఉన్న వారికి నామినేషన్ వేయడానికి అవకాశం
  • బరిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండగా, ఆ సమయానికి గేటు లోపల ఉన్నవారికి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Jubilee Hills Bypoll
Telangana Elections
Lankala Deepak Reddy
BJP Telangana
Nomination Deadline

More Telugu News