KTR: బస్తీ దవాఖానాలను పరిశీలించిన మాజీ మంత్రులు.. వీడియో ఇదిగో!

KTR Inspects Basti Dawakhanas Alleging Neglect by Congress
  • బస్తీ దవాఖానాలలో పేరుకుపోయిన సమస్యలు
  • వైద్యులకు నాలుగు నెలలుగా జీతాలివ్వడంలేదు
  • ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలు ప్రస్తుతం సమస్యలతో సతమతం అవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిరుపేదలకు వైద్య సేవలను అందించే సదుద్దేశంతో తమ ప్రభుత్వం ఈ బస్తీ దవాఖానాలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఈ రోజు ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానాను మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. అక్కడి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడంలేదని అక్కడి మహిళా వైద్యురాలు కేటీఆర్ కు తెలిపారు.

ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానాలోనూ ఇదే సమస్య నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇక్కడి వైద్యులకు కూడా నాలుగు నెలలుగా జీతాలు అందడంలేదని చెప్పారు. ఓల్డ్ లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను హరీశ్ రావు సందర్శించారు. వైద్యులు, అక్కడికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడారు. మరోవైపు, బోరబండలోని వినాయకరావు నగర్ లో ఉన్న బస్తీ దవాఖానాను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ రోజు ఉదయం సందర్శించారు. అక్కడి వైద్యులతో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. వైద్యులు, రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నిరుపేదల చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సూచనలతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్తీ దవాఖానాలను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైద్యులకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
KTR
Basti Dawakhana
Telangana
Harish Rao
Jagadish Reddy
BRS
Congress Government
Healthcare
Telangana Health
Free Medical Services

More Telugu News