Nandeeshwar Reddy: హాస్టల్ విద్యార్థినులతో కలిసి యాచారం పోలీసుల దీపావళి వేడుకలు

Yacharam Police Celebrate Diwali with BC Girls Hostel Students
––
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో చదివిన వాళ్లలో చాలామంది గొప్పవాళ్లయ్యారని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో పట్టుదలగా చదవాలంటూ విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ మేరకు సోమవారం దీపావళి పండుగ సందర్భంగా యాచారంలోని బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి పోలీసులు వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ఎస్సైలు మధు, ప్రియాంక సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలతో కలిసి టపాసులు కాల్చి, స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ.. చదువు ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకోవాలని ఆయన సూచించారు.
Nandeeshwar Reddy
Yacharam
Yacharam CI
BC Girls Hostel
Diwali Celebrations
Telangana Police
Student welfare
Education importance
Poverty reduction
Government schools

More Telugu News