: విశాఖలో రోడ్డు ప్రమాదం .. ఇద్దరు యువకుల మృతి

  • పాత గాజువాక జంక్షన్ వద్ద ఘటన 
  • బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం
  • అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు
విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత గాజువాక జంక్షన్‌ వద్ద నిన్న అర్ధరాత్రి వేగంగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
 
మృతులను కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన అజయ్ రాజు (17), మనోజ్ కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ప్రాథమిక విచారణలో అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మరణించిన యువకుల కుటుంబాల్లో దీపావళి పండుగ వేళ విషాద ఛాయలు అలముకున్నాయి. 

More Telugu News