ట్రంప్ హత్యకు మరో కుట్ర..!
- విమానం ఎక్కుతుండగా కాల్పులు జరిపేందుకు ఏర్పాట్లు
- పామ్ బీచ్ ఎయిర్ పోర్టు సమీపంలో స్నైపర్ హైడవుట్
- భద్రతా తనిఖీల్లో గుర్తించి అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది
- ట్రంప్ ను విమానం వెనక వైపు నుంచి లోపలికి పంపించిన వైనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి దుండగులు మరోమారు ప్రయత్నించే ఏర్పాట్లు చేసుకున్నారని, భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ముప్పు తప్పిందని ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తాజాగా వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరపడం, అదృష్టవశాత్తూ చిన్న గాయంతో ట్రంప్ తప్పించుకోవడం తెలిసిందే. ఆ తర్వాత కూడా ట్రంప్ పై దాడికి ప్రయత్నం జరిగింది. తాజాగా పామ్ బీచ్ విమానాశ్రయం సమీపంలో దుండగులు మరో ప్రయత్నం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం బయటపడింది.
ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే చోటుకు దాదాపు 200 గజాల దూరంలో ఓ చెట్టుపై స్నైపర్ (దూరం నుంచి గురితప్పకుండా కాల్పులు జరిపే వ్యక్తి) దాక్కునేందుకు చేసుకున్న ఏర్పాట్లను ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. దుండగులు ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి.. వేటగాళ్లు ఎదురుచూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతుండగా గూడులో నుంచి కాల్పులు జరిపేలా ఏర్పాట్లు ఉండడంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ట్రంప్ ను విమానం ముందు నుంచి కాకుండా వెనక వైపు చిన్న మెట్లు అమర్చి లోపలికి పంపించారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరుపుతోంది.