Tejaswi Yadav: బీహార్ బరిలో కీలక నేతల వారసులు

Bihar Assembly Elections Key Leaders Family Members Competing
  • తొలి విడత ఎన్నికలకు ముగిసిన నామినేషన్.. 121 సీట్లకు 1,250 మంది పోటీ
  • అన్ని పార్టీల్లోనూ వారసులకు దక్కిన టికెట్లు
  • ఆర్జేడీ చీఫ్ లాలూ వారసుడిగా తేజస్వీ యాదవ్
  • కుమారుడిని బరిలోకి దింపిన బీజేపీ నేత శకుని చౌదరి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ వంటి జాతీయ పార్టీల్లోనూ నేతల వారసులకు టికెట్లు దక్కాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సుప్రీం నేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, ఆర్జేడీ సీనియర్ నేత షహబుద్దీన్ తనయుడు ఒసామా షాహబ్, బీజేపీ శకుని చౌదరి వారసుడిగా సమ్రాట్ చౌదరి, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీశ్ మిశ్రా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ సతీమణి స్నేహలతలతో పాటు జన్ సురాజ్ పార్టీలో కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అధికార పార్టీ జనతా దళ్ (యూ) లోనూ పలువురు వారసులకు టికెట్లు దక్కాయి. ఎల్జేపీ ఎంపీ వీనా దేవీ కూతురు కోమల్ సింగ్, ఎంపీ లవ్లీ ఆనంద్ కుమారుడు చేతన్ ఆనంద్, ఎంపీ గిరిధారి ప్రసాద్ యాదవ్ కుమారుడు చాణక్య ప్రసాద్ రంజన్ లకు పార్టీ టికెట్లు దక్కాయి.

121 సీట్లకు 1,250 మంది పోటీ 
రెండు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత వచ్చే నెల 6న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తం 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 1,250 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తొలి విడత బరిలో మంత్రులు
బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి (బీజేపీ)తో పాటు మంత్రులు విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ), మంగల్ పాండే (బీజేపీ), విజయ్ కుమార్ చౌదరి (జేడీయూ)లు తొలి విడత ఎన్నికల బరిలో ఉన్నారు.
Tejaswi Yadav
Bihar Elections
Lalu Prasad Yadav
Samrat Choudhary
Nitish Mishra
Jitan Ram Manjhi
Bihar Politics
RJD
BJP
наследники политиков

More Telugu News