Punnanapalem: 200 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటున్న ఏపీలోని గ్రామం.. కారణం ఇదే!
- శ్రీకాకుళం జిల్లా పున్నానపాలెంలో వింత ఆచారం
- గత 200 ఏళ్లుగా దీపావళికి దూరంగా గ్రామస్థులు
- నాటి విషాద ఘటనే ఇందుకు కారణమని వెల్లడి
- పాము కాటుతో చిన్నారి మృతి... అదే రోజున రెండు ఎద్దుల మృతి
- పూర్వీకుల కట్టుబాటును నేటికీ పాటిస్తున్న జనం
దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా ఈ పండుగకు దూరంగా ఉంటోంది. దీపావళి రోజున ఆ ఊరంతా చీకట్లోనే మగ్గిపోతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పున్నానపాలెం గ్రామస్థులు గత 200 ఏళ్లుగా దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. దీని వెనుక ఓ తీవ్రమైన విషాద గాథ ఉంది.
వివరాల్లోకి వెళితే, సుమారు 200 ఏళ్ల క్రితం దీపావళి పండుగ రోజున పున్నానపాలెం గ్రామంలో ఊహించని దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అదే రోజున గ్రామానికి చెందిన మరో రైతు ఇంట్లో రెండు ఎద్దులు కూడా అకస్మాత్తుగా మరణించాయి. ఒకే రోజు జరిగిన ఈ వరుస విషాదాలతో గ్రామస్థులు తీవ్రంగా కలత చెందారు.
ఈ ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన గ్రామ పెద్దలు, దీపావళి పండుగ తమ గ్రామానికి అచ్చిరాలేదని భావించారు. భవిష్యత్తులో ఇలాంటి అపశకునాలు పునరావృతం కాకూడదని భావించి, గ్రామంలో ఎవరూ దీపావళి పండుగను జరుపుకోకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ రోజు నుంచి ఈ కట్టుబాటును గ్రామస్థులు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.
తమ పూర్వీకులు విధించిన ఆ కట్టుబాటును నేటి తరం కూడా గౌరవిస్తూ, దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. పండుగ రోజున టపాసులు కాల్చడం గానీ, ఇళ్లకు దీపాలు అలంకరించుకోవడం గానీ చేయరు. ఆ రోజున పున్నానపాలెం గ్రామం ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది. తరాలు మారుతున్నా, తమ పూర్వీకుల మాటను గౌరవిస్తూ ఈ వింత ఆచారాన్ని కొనసాగించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.