Tirumala: తిరుమల ఘాట్ రోడ్డుపై మళ్లీ చిరుత సంచారం

Leopard spotted again on Tirumala Ghat Road
  • తిరుమల రెండో ఘాట్ రోడ్ వద్ద సీసీ కెమెరాలో రికార్డైన చిరుత దృశ్యాలు
  • వినాయక స్వామి ఆలయం సమీపంలో కుసుమ రహదారిలో వేకువ జామున సంచరించిన చిరుత
  • భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు
తిరుమల ఘాట్ రోడ్డులో మరోమారు చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచరించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రెండవ ఘాట్ రోడ్డు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

అలిపిరి తనిఖీ కేంద్రం, వినాయక స్వామి ఆలయం మధ్య కుసుమ రహదారిలో నిన్న వేకువజామున మూడు గంటల ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.

భక్తులు రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Tirumala
Tirumala ghat road
leopard
Tirumala leopard
Alipiri
TTD
forest department
Tirupati
wildlife

More Telugu News