Kiran Abbavaram: 'కె-ర్యాంప్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర దృశ్యం... వీడియో ఇదిగో!

Kiran Abbavaram Fan Moment at K Ramp Pre Release Event
  • హైదరాబాద్ లో గతరాత్రి 'కె ర్యాంప్' ర్యాంపేజ్ ఈవెంట్‌
  • హీరో కిరణ్ అబ్బవరం కాళ్లపై పడిన అభిమాని
  • వెంటనే అతడిని పైకి ఆప్యాయంగా మాట్లాడిన కిరణ్
  • సోషల్ మీడియాలో వీడియో ఫుల్ వైరల్
  • కిరణ్ సింప్లిసిటీపై నెటిజన్ల ప్రశంసల వర్షం
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరోసారి తన వినయంతో, అభిమానుల పట్ల చూపే ప్రేమతో వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన 'కె ర్యాంప్' మూవీ ర్యాంపేజ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అభిమాని ఉద్వేగంతో కిరణ్ కాళ్లపై పడటం, దానికి ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే... కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కె ర్యాంప్' చిత్రం రేపు (అక్టోబరు 18) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం గురువారం నాడు హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరం కూర్చని ఉండగా... ఓ అభిమాని ఒక్కసారిగా ఆయన వద్దకు వచ్చి కాళ్ల మీద పడిపోయాడు. దాంతో, కిరణ్ అబ్బవరం వెంటనే కిందకు వంగి, ఆ అభిమానిని ఎంతో ఆప్యాయంగా పైకి లేపారు. అంతేకాకుండా, అతడి భుజం తట్టి, ప్రేమగా మాట్లాడారు. అక్కడున్న వారు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, ఆ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కిరణ్ అబ్బవరం సింప్లిసిటీని, అభిమానుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. "హీరో అంటే ఇలా ఉండాలి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన సినిమాలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కిరణ్, ఈ సంఘటనతో వ్యక్తిగతంగా కూడా అభిమానుల మనసులను గెలుచుకున్నారు. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, అభిమానులతో ఆయన మమేకమయ్యే తీరు ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతోంది. 
Kiran Abbavaram
K Ramp
Kiran Abbavaram movie
Yukti Thareja
Jains Nani
K Rampage Event
Hyderabad
Telugu cinema
Movie pre release event
Viral video

More Telugu News