Amitabh Bachchan: టాయిలెట్ నిర్మాణానికి ఆర్థికసాయం అందించిన అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan Donates for Toilet Construction
  • మరోసారి తన ధాతృత్వాన్ని చాటుకున్న బిగ్ బీ
  • కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్న జయంత్ దులేకి రూ.2లక్షల ఆర్ధిక సాయం అందజేత
  • ఆర్ధిక సాయంతో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసిన దులే కుటుంబం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో పాల్గొన్న ఓ యువకుడికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించారు.

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన జయంత్ దులే అనే యువకుడు పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, వారి ఇంటికి మరుగుదొడ్డి కూడా లేకపోవడం వల్ల కష్టాలు పడుతున్నామని గత సీజన్‌లో బిగ్‌బీకి తెలిపాడు. ఆ వ్యాఖ్యలు అమితాబ్ బచ్చన్‌ను కదిలించాయి.

దీనిపై వెంటనే స్పందించిన బిగ్‌బీ మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అవసరమైన రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ ఆయన దులే కుటుంబానికి ఆ నిధులు అందించారు.

తాజాగా అమితాబ్ అందించిన సహాయంతో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని ఆయనకు మెయిల్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్న దులే కుటుంబం.. కృతజ్ఞతగా ఆ మరుగుదొడ్డి బయట అమితాబ్ బచ్చన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి, ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.

కుటుంబ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ జయంత్ దులే కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు. ఇదే సమయంలో బిగ్ బీ రియాలిటీ షోలో పాల్గొనేందుకు తీవ్ర కృషి చేసి ఎనిమిదేళ్ల ప్రయత్నం తర్వాత గత ఏడాది (2024లో) కౌన్ బనేగా కరోడ్‌పతి-16లో పాల్గొని రూ.15.70 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో కుటుంబ రుణాలను తీర్చడమే కాకుండా సోదరి, సోదరుడు చదువులకు కూడా అండగా నిలిచాడు. 
Amitabh Bachchan
Amitabh Bachchan donation
Kaun Banega Crorepati
Jayant Dhule
toilet construction
financial assistance
West Bengal
Hugli district
KBC winner
charity

More Telugu News