Bhupendra Patel: గుజరాత్‌లో కీలక పరిణామం... ముఖ్యమంత్రి మినహా మంత్రులంతా రాజీనామా!

Bhupendra Patel Gujarat Ministers Resign En Masse
  • ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా తప్పుకున్న మంత్రులు
  • రేపు మధ్యాహ్నం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
  • పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు.
Bhupendra Patel
Gujarat
Gujarat Ministers Resignation
Gujarat Cabinet
Gujarat Government

More Telugu News