TGIIC: రాయదుర్గంలో మరోసారి భూముల వేలం.. గజం రూ. 3,10,000...!

TGIIC to Auction Lands Again in Rayadurgam
  • నాలెడ్జ్ సిటీలోని 4,718.22 చదరపు గజాల వేలానికి టీజీఐఐసీ నోటిఫికేషన్
  • నవంబర్ 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం
  • ఇటీవల రాయదుర్గంలో రూ. 177 కోట్లు పలికిన ఎకరం భూమి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలానికి మరోసారి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీలో 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయడానికి టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గజానికి రూ. 3,10,000 రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు టీజీఐఐసీ పేర్కొంది. ఈ భూమికి సంబంధిచిన ఈ-వేలం నవంబర్ 11న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీజీఐఐసీ కార్యాలయంలో జరుగుతుందని తెలిపింది.

ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ 18.67 ఎకరాలను వేలానికి పెట్టింది. తొలి విడతలో 7.67 ఎకరాలను వేలం వేయగా, ఎకరం భూమి రూ. 177 కోట్లు పలికింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన భూముల వేలంలో ఇది అత్యధిక ధర. 7.67 ఎకరాల భూమిని రూ. 177 కోట్ల చొప్పున రూ. 1,356 కోట్లకు ఎంఎస్ఎం రియాల్టీ సంస్థ దక్కించుకుంది. ఈసారి గజానికి రూ. 3,10,000 అంటే ఎకరాకు రూ. 124 కోట్లుగా వస్తుంది.
TGIIC
Rayadurgam
Land Auction
Telangana Government
Serilingampally
Knowledge City
Real Estate

More Telugu News