K Kavitha: నాపై కుట్ర చేసి బీఆర్ఎస్ నుంచి బయటకు గెంటేశారు.. అందుకే కేసీఆర్ ఫొటోను ఉపయోగించడం లేదు: కవిత

K Kavitha Alleges Conspiracy Forced Her Out of BRS
  • 'జాగృతి జనం బాట' యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత
  • పోస్టర్‌పై తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలు
  • సామాజిక తెలంగాణ అన్నందుకు తన మీద కుట్రలు చేశారన్న కవిత
సామాజిక తెలంగాణ కోసం నిలబడినందుకే తనపై కుట్రలు చేసి బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలని పిలుపునివ్వడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ, సామాజిక తెలంగాణను ఇంకా సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో 'జాగృతి జనం బాట' యాత్ర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌పై తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక చైతన్యం కోసమే ఈ యాత్ర అని స్పష్టం చేశారు. తమ దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫొటోను ఉపయోగించడం సముచితం కాదని భావించినట్లు తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని కవిత అన్నారు. నాలుగు నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైనవారని, వారికి అన్నీ విషయాల పట్ల అవగాహన ఉంటుందని కవిత అన్నారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామని ఆమె పేర్కొన్నారు.
K Kavitha
K Kavitha BRS
Telangana Jagruthi
BRS Party
KCR
Social Telangana
Jagruthi Janam Bata Yatra

More Telugu News