USA India: మాకు భారత్ సాయం కావాలి.. అమెరికా ఆర్థిక మంత్రి

America needs India to confront China says Scott Bessent
  • అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు
  • ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనన్న స్కాట్ బెసెంట్
  • అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా మాత్రం ఆర్థిక యుద్ధం చేస్తోందని ఫైర్
ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా పోకడను అమెరికా తప్పుబట్టింది. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టడిచేస్తోందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ ధోరణిని అమెరికా సహించబోదని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సాహాయం కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్ పై అమెరికా భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. అయితే, చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సాహాయం చేయాలని అమెరికా కోరడం గమనార్హం.

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇటీవల ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించిందని చెప్పారు. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే షరతు విధించిందన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆయన మండిపడ్డారు. బీజింగ్‌ దూకుడును అమెరికా అడ్డుకుంటుందన్నారు. ఇందుకోసం భారత్‌, ఐరోపా దేశాల మద్దతు కావాలని వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని స్కాట్ బెసెంట్ దుయ్యబట్టారు.
USA India
Scott Bessent
China
United States
rare minerals
India
economic dominance
trade war
supply chain
Foxconn
Beijing

More Telugu News