మా ఇద్దరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయో మీకు అర్థమై ఉంటుంది: కిరణ్ అబ్బవరం
- శనివారం ప్రేక్షకుల ముందుకు రానున్న కె రాంప్
- మీడియా సమావేశంలో మూవీ విషయాలను వెల్లడించిన కిరణ్ అబ్బవరం
- కుటుంబ సమేతంగా చూసేలా ఉండబోతుందన్న కిరణ్
యూత్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’ (K -RAMP) ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు జైన్స్ నాని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా విశాఖపట్నంలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ అబ్బవరం తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. “మేమంతా ఇప్పటికే సినిమా చూశాం. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ‘కె–ర్యాంప్’ని తీర్చిదిద్దాం. ఇది పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సినిమా చూస్తూ మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్టుగా అనిపించింది. కథలోని వినోదం సెట్స్ మీద కూడా ఫీల్ అయ్యాం,” అన్నారు.
హీరోయిన్ యుక్తి గురించి మాట్లాడుతూ.. “ఆమె పెర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మా ఇద్దరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయో ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పాటలతో మీకే అర్థమై ఉంటుంది,” అన్నారు.
దర్శకుడు జైన్స్ నానితో తన బంధం గురించి మాట్లాడుతూ... “జైన్స్ నాని మహేశ్ బాబు ఫ్యాన్, నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ఎప్పుడూ స్పెషల్. కానీ చివరికి వాళ్లంతా మిత్రులే అవుతారు. అలాగే మేము కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యాం,” అని చెప్పుకొచ్చారు.
సినిమాపై విశ్వాసం వ్యక్తం చేస్తూ..
“ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసేలా ఉండబోతుంది. ఎక్కడా ఇబ్బంది పడరు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘వెంకీ’, ‘రెడీ’ సినిమాల్లాగే మా ‘కె–ర్యాంప్’ కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తారు అని నమ్ముతున్నా,” అంటూ కిరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.