Konda Surekha: నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు: మంత్రి కొండా సురేఖ

Konda Surekha Clarifies Nagarjuna Comments Controversy
  • ఆ విషయంలో మనస్థాపం చెందానన్న మంత్రి
  • అందుకే మీడియాతో ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నానని వ్యాఖ్య
  • కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు
నటుడు అక్కినేని నాగార్జున గురించి తాను మాట్లాడిన అంశాన్ని కొందరు వివాదాస్పదం చేశారని అన్నారు. ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని, అందుకే మీడియా ముందు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నానని ఆమె తెలిపారు. ఏదైనా సమస్య ఉన్నా పార్టీ అధిష్ఠానానికి నేరుగా తెలియజేసే రాజకీయాలు చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

కొందరు తనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఏ పని చేసినా దానిని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని అన్నారు. తన శాఖకు సంబంధించిన పనులను నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళుతున్నానని ఆమె పేర్కొన్నారు.

కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ ఎన్. సుమంత్‌ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. సుమంత్ కాలుష్య నియంత్రణ బోర్డులో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పరిపాలనా కారణాల దృష్ట్యా సుమంత్‌ను తొలగిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది.
Konda Surekha
Nagarjuna
Telangana Politics
Konda Surekha Controversy
Telangana Minister

More Telugu News