Sangareddy theft: సంగారెడ్డిలో కారు అద్దాలు పగులగొట్టి రూ. 20 లక్షలు చోరీ

Sangareddy Theft 20 Lakhs Stolen After Car Window Smashed
  • సంగారెడ్డిలో ఇల్లును విక్రయించి కారులో నగదు తీసుకువస్తున్న బాధితుడు
  • బంధువుల ఇంటి ముందు కారు ఆపి లోనికి వెళ్లిన వైనం
  • బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అద్దాలు పగులగొట్టి నగదు చోరీ
సంగారెడ్డిలో కారు అద్దాలు పగులగొట్టి రూ. 20 లక్షలు దోపిడీ చేసిన ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ముజాఫిర్ అనే వ్యక్తి సంగారెడ్డిలో తన ఇంటిని విక్రయించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి రూ. 20 లక్షల నగదుతో కారులో బయలుదేరారు. సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్ వద్ద బంధువుల ఇంటి ముందు కారును ఆపి లోపలకి వెళ్లారు.

అదే సమయంలో, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 20 లక్షలను అపహరించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగదును దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Sangareddy theft
Sangareddy
Telangana crime
Car theft
20 lakh theft
Hyderabad

More Telugu News