US China trade war: సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. నౌకలపై ప్రత్యేక ఛార్జీ వసూలు

US China Trade War at Sea Vessel Fee Imposed
  • పరస్పరం ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్న ఇరుదేశాలు
  • అమెరికా జెండాతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేస్తామన్న చైనా
  • చైనా నిర్మించిన నౌకలకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వెల్లడి
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా, ఇరుదేశాలు నౌకలపై పరస్పరం ప్రత్యేక ఫీజులను ప్రకటించాయి. అమెరికా యాజమాన్యంలోని నౌకలు, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. చైనాలో నిర్మించిన నౌకలకు మాత్రం ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజును వసూలు చేస్తోంది.

అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల అంశంపై తమ వైఖరి స్థిరంగా ఉందని, అమెరికా ఈ తరహా యుద్ధం కోరుకుంటే తాము చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. ఒకవేళ చర్చలు జరపడానికి సిద్ధమైతే, అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
US China trade war
United States
China
Trade tariffs
Shipping charges
Vessel fees
China ministry of commerce

More Telugu News