Avika Gor: ఆ పాత్ర దేశంలోని ప్రతి ఇంట్లో నాకు స్థానం కల్పించింది: అవికా గోర్
- 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌పై నటి అవికా గోర్ వ్యాఖ్యలు
- ఇప్పటికీ 'ఆనంది' అని పిలవడం గర్వంగా ఉందని వెల్లడి
- ఆ గుర్తింపు తనను ప్రతీ ఇంటికి కనెక్ట్ చేసిందన్న నటి
- టీవీ షోలో పెళ్లి చేసుకోవడంపైనా స్పందన
- విమర్శలు వస్తాయని ముందే ఊహించానని వ్యాఖ్య
- చిన్నతనం నుంచే భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడి
'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్‌తో దేశవ్యాప్తంగా ప్రతీ ఇంట్లోనూ సుపరిచితమైన నటి అవికా గోర్, 'ఆనంది' పాత్ర తనకు ఇచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సీరియల్ ముగిసి ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఇప్పటికీ తనను ఆనందిగానే గుర్తుంచుకోవడంపై గర్వంగా ఉందని తెలిపింది. ఇటీవలే ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా తన మనసులోని మాటలను పంచుకుంది.
"నిజం చెప్పాలంటే, ప్రజలు నన్ను ఇంకా ఆనంది అని పిలుస్తుంటే గర్వంగా ఉంటుంది. అది నా రెండో పేరులా మారిపోయింది. ఈరోజే ఎయిర్‌పోర్టులో ఒక ఆంటీ నా దగ్గరికి వచ్చి బుగ్గలు గిల్లి 'ఆనంది' అని ప్రేమగా పిలిచింది. ప్రజలు నన్ను అలా పిలవడం ఆపేయాలని నేను అస్సలు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆ పాత్రే నన్ను దేశంలోని ప్రతీ కుటుంబానికి దగ్గర చేసింది. ఎంతోమందికి నన్ను కూతురిని చేసింది. ఆ బంధాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను" అని అవికా వివరించింది.
ఇటీవలే తన ప్రియుడు మిలింద్ చంద్వానీని 'పతి పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడంపైనా ఆమె స్పందించింది. "టీవీ షోలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే, దీనిపై విమర్శలు వస్తాయని మాకు తెలుసు. ఆ విషయంలో మేమేమీ ఆశ్చర్యపోలేదు. నేను చిన్నప్పటి నుంచి నా కెరీర్‌లోనూ, జీవితంలోనూ భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను. చాలామంది నా నిర్ణయాలతో ఏకీభవించకపోయినా, నా దారిని నేనే నిర్మించుకోవాలని నమ్మాను" అని పేర్కొంది.
"నా పెళ్లి కూడా భిన్నంగానే ఉంటుందని నాకు తెలుసు. నా జీవితం, నా ప్రయాణం చూసి చాలామంది కలలు కంటారు. ఆ విషయాన్ని నేను అంగీకరిస్తాను, అందుకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. కానీ, ఇక్కడి వరకు రావడం అంత సులభం కాదు" అని అవికా గోర్ వెల్లడించింది. 'బాలికా వధు' తర్వాత 'ససురాల్ సిమర్ కా' వంటి సీరియల్స్‌తోనూ, ఆ తర్వాత సినిమా రంగంలోనూ అవికా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఉయ్యాల జంపాల, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో అలరించింది.