ఓటీటీలో దూసుకుపోతున్న 'బాంబ్'
- తమిళంలో రూపొందిన 'బాంబ్'
- సెప్టెంబర్ 12న థియేటర్లకు
- ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
- దర్శకుడిగా విశాల్ వెంకట్
- దూసుకుపోతున్న కంటెంట్
ఈ మధ్య కాలంలో తమిళంలో ఒక చిత్రమైన కంటెంట్ తో ఒక సినిమా వచ్చింది. సరదాగా సందడి చేసిన ఆ సినిమా పేరే 'బాంబ్'. కాళీ వెంకట్ .. అర్జున్ దాస్ .. నాజర్ .. శివాత్మిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. సుధా సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకి, విశాల్ వెంకట్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో తమిళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే, కాలపట్టి - కమ్మైపట్టి అనే రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఆ రెండు గ్రామాలు అనేక కారణాల వలన చాలా కాలంగా గొడవలు పడుతూ ఉంటాయి. 'కాలపట్టి'కి చెందిన యోగేశ్ అనే కుర్రాడికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. దాంతో అతను నిద్రలో నడుస్తూ 'కమ్మైపట్టి' వెళ్లి ఊరు పెద్ద కుర్చీపై కాలు పెట్టి కూర్చుంటాడు. దాంతో ఆ గ్రామస్తులు ఆగ్రహావేశాలతో ఉంటారు.
కాలపట్టిలో ప్రభ - కథీర్ అనే అన్నాచెల్లెళ్లు ఉంటారు. ఆ రెండు గ్రామాల మధ్య గల సమస్యను పరిష్కరించడానికి కథీర్ ట్రై చేస్తూ ఉంటాడు. ఆ పనిపై అతను కలెక్టర్ ను కూడా కలుసుకుని వస్తాడు. ఆ రోజు రాత్రే అతను చనిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ రెండు గ్రామాల ప్రజలను ఆ సంఘటన ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది మిగతా కథ. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది.