Addanki Dayakar: మీ సెంటిమెంట్ ఇక్కడ పని చేయదు: హరీశ్ కు అద్దంకి దయాకర్ కౌంటర్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు
- గెలుస్తామన్న భ్రమల్లో బీఆర్ఎస్ బతుకుతోందని దయాకర్ ఎద్దేవా
- కంటోన్మెంట్లాగే జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపని ధీమా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తామన్న భ్రమల్లో ఉందని, అసలు ఆ పార్టీ ప్రతిపక్షంగా కూడా ఉనికిలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.
"తెలంగాణను బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కారు పార్టీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారు" అని అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైతే గెలిపించారో, అదే విధంగా జూబ్లీహిల్స్‌లో కూడా తమ పార్టీకి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హరీశ్ రావును వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. "మీరు, మీ బామ్మర్ది కలిసి సెంటిమెంట్‌తో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ప్రయోజనం ఉండదు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ వైపే వారు నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.