Ponguleti Srinivas Reddy: కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy Responds to Konda Surekhas Complaint
  • తానేమిటో అందరికీ తెలుసన్న మంత్రి
  • తనపై ఫిర్యాదు చేయడానికి అసలు ఏముందని ప్రశ్న
  • సహచర మంత్రులు ఫిర్యాదు చేశారనంటే నమ్మబుద్ధి కావడం లేదని వ్యాఖ్య
మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. మేడారం జాతర కాంట్రాక్టు పనులను పొంగులేటి తన సొంత కంపెనీకి ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కొండా దంపతులు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పొంగులేటి స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

తన గురించి అందరికీ తెలుసని ఆయన అన్నారు. తాను రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి అసలు విషయమేముందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఇద్దరూ సమ్మక్క, సారక్కల్లా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

మేడారం అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ, మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటామని అన్నారు. ఎంత ఖర్చైనా మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
Ponguleti Srinivas Reddy
Konda Surekha
Telangana Ministers
Medaram Jatara
Sammakka Saralamma Jatara

More Telugu News