Tushar: పట్టాలపై పడిపోయిన బైక్.. తీస్తుండగానే దూసుకొచ్చిన రైలు.. యువకుడు స్పాట్ డెడ్

Train accident in Uttar Pradesh claims youths life
  • గ్రేటర్ నోయిడాలో రైలు ప్రమాదం
  • మూసి ఉన్న రైల్వే గేటును దాటేందుకు ప్రయత్నం
  • పట్టాలపై బైక్ జారిపోవడంతో జరిగిన ఘోరం
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూసి ఉన్న రైల్వే గేటును దాటే ప్రయత్నంలో ఓ యువకుడు రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన నిన్న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, దాద్రి ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే గేటు మూసి ఉన్నప్పటికీ, అతను దాని కింది నుంచి దూరి పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని బైక్ అదుపుతప్పి పట్టాలపై జారిపడింది. దీంతో అతను కిందపడిపోయాడు.

వెంటనే తేరుకున్న తుషార్, సమీపిస్తున్న రైలును గమనించకుండా తన బైక్‌ను పైకి లేపే ప్రయత్నం చేశాడు. క్షణాల వ్యవధిలో రైలు వేగంగా దూసుకొస్తుండటాన్ని చూసి, బైక్‌ను వదిలేసి పక్కకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. వేగంగా వచ్చిన రైలు అతడిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదిలా ఉండగా, జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా జరిగాయి. దేశవ్యాప్తంగా నమోదైన 2,483 ప్రమాదాల్లో 1,025 కేసులు ఒక్క యూపీలోనే జరగడం గమనార్హం. అదేవిధంగా, ఈ ప్రమాదాల్లో మరణించిన 2,242 మందిలో 1,007 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 
Tushar
Greater Noida accident
railway accident
train accident Uttar Pradesh
NCRB report
railway crossing accidents India
Dadri
Uttar Pradesh crime
train accident video
railway gate crossing

More Telugu News