Jubilee Hills Election: జూబ్లీహిల్స్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం... తొలి నామినేషన్ ఎవరు వేశారంటే..!

Jubilee Hills Bypoll Nomination Process Begins First Nomination Filed
  • మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ
  • తొలిరోజే నామినేషన్లు దాఖలు చేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు
  • నవంబర్ 11న పోలింగ్
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల సంఘం ఈ ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయనతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల నామినేషన్ల కోసం ముహూర్తాలు ఖరారు చేస్తుండగా, స్వతంత్రులు ముందుగా బరిలోకి దిగడం గమనార్హం.

ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మరోవైపు, బీజేపీ లంకల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న పలితాలు వెలువడనున్నాయి.
Jubilee Hills Election
Telangana Elections
Pesari Kayala Parikshit Reddy
Siliveru Srikanth
Naveen Yadav
Maganti Sunitha
Lankala Deepak Reddy
Telangana Politics
Hyderabad Elections

More Telugu News