Divyela Madhuri: ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా రచ్చ చేసి ఏడ్చేసింది.. బిగ్ బాస్ షోలో దివ్వెల మాధురి.. వీడియో ఇదిగో!

Divyela Madhuri Enters Bigg Boss Telugu and Cries
  • వైల్డ్ కార్డుతో హౌస్ లోకి దివ్వెల సహా ఆరుగురి ఎంట్రీ
  • తాజాగా ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల
  • కళ్యాణ్, దివ్యలతో గొడవ, ఆపై దివ్వెల మాధురి కన్నీళ్లు
బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. వారంవారం కొంతమంది ఎలిమినేట్ అయి హౌస్ లో నుంచి బయటకు రాగా ఆదివారం వైల్డ్ కార్డ్ తో ఆరుగురు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష కూడా ఉండడం విశేషం. మిగతా వారిలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా ఉన్నారు. కొత్త కంటెస్టెంట్స్ రాక తో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజులోనే దివ్వెల మాధురి కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమోలో దివ్వెల మాధురి హౌస్ లోని కంటెస్టెంట్లతో గొడవపడి కంటతడి పెట్టడం కనిపించింది. 

ప్రోమో వీడియోలో..
ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, కల్యాణ్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కల్యాణ్ కిచెన్ దగ్గర ఉన్న దివ్వెల మాధురిని పిలిచాడు. దీంతో అక్కడికి వచ్చిన మాధురిని కూర్చోమని ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. మధ్యలోనే కల్పించుకున్న మాధురి.. ఏం కూర్చోకుంటే ఊరుకోరా అంటూ వెటకారంగా మాట్లాడింది. అయినా సరే కల్యాణ్ మామూలుగానే మాట్లాడుతూ.. రేపటి నుంచి షెడ్యూల్ మారుస్తాం అని చెప్పాడు. దీనికి మాధురి ఆగ్రహంగా.. ‘నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది అప్పుడు చెప్పొచ్చుగా... ఏం చేస్తున్నారు.? అప్పుడు తెలియదా..? అని అనడంతో కల్యాణ్ సహా అక్కడున్న వారంతా నివ్వెరపోయాడు.

తర్వాత మీరిలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తోందని కల్యాణ్ అనడంతో దివ్వెల మాధురి కూడా రెచ్చగొట్టేలా జవాబిచ్చింది. ఇంతలో దివ్య కల్పించుకుంటూ.. ‘మీరు ఇక్కడ లేరు... అందుకే చెబుతు...న్నా గొడవపడాలని కాదు’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మాధురి ఏమాత్రం తగ్గకుండా దివ్యతో పాటు కల్యాణ్ తోనూ గొడవపడింది. అనంతరం దివ్వెల మాధురి పక్కకు వెళ్లి కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఇది చూసిన కల్యాణ్.. అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడు ఏడిస్తే ఎలా అంటూ భరణి దగ్గర వాపోయాడు.

Divyela Madhuri
Bigg Boss Telugu
Bigg Boss Season 9
Alekya Chitti
Ramya Moksha
Srinivas Sai
Nikhil Nair
Ayesha Zeenath
Gaurav Gupta

More Telugu News