Donald Trump: ట్రంప్ కు ప్రెసిడెన్షియల్ మెడల్ ప్రకటించిన ఇజ్రాయెల్

Israel Awards Trump for Efforts in Gaza Deal and Hostage Release
  • గాజా ఒప్పందం కుదిర్చారని ట్రంప్ కు కితాబునిచ్చిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌
  • హమాస్ చెరలో ఉన్న తమ పౌరులను విడిపించారని ప్రశంసలు
  • ట్రంప్‌ సాయాన్ని ఇజ్రాయెల్‌ ప్రజలు తరతరాలపాటు గుర్తించుకుంటారని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఈమేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ను ట్రంప్ కు అందించి గౌరవించనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ పేర్కొన్నారు. హమాస్ చెరలో రెండేళ్లుగా మగ్గుతున్న తమ పౌరులను విడిపించినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించినట్లు తెలిపారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు తెలిపారు.

గాజా ఒప్పందం కుదర్చడంలో, బందీల విడుదలలో ట్రంప్ చేసిన కృషిని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ట్రంప్ అవిశ్రాంత కృషి కారణంగానే హమాస్‌ చెరలో ఉన్న తమ పౌరులు నేడు తిరిగి వస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్‌లోనే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్‌ పునాది వేశారని ఇస్సాక్‌ హెర్జోగ్‌ కొనియాడారు.
Donald Trump
Israel
Presidential Medal of Honor
Isaac Herzog
Hamas
Gaza
Hostage Release
Middle East Peace

More Telugu News