Praveen Prakash: కోపంతోనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశా: మాజీ అధికారి ప్రవీణ్ ప్రకాశ్

Praveen Prakash Reveals Anger Behind IAS Resignation
  • కోపంతోనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశానన్న ప్రవీణ్ ప్రకాశ్
  • ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాల వెల్లడి
  • గత ఏడాదిగా తీవ్ర ఒంటరితనం, తిరస్కరణకు గురయ్యానని వెల్లడి
  • తన తప్పేంటో చెప్పమని సీనియర్లను అడిగినా సమాధానం రాలేదని వ్యాఖ్య
  • ఇప్పుడు కొత్తగా 'జర్నీ 2.0' ప్రారంభిస్తున్నట్లు స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు అత్యంత కీలక అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన కోపంతోనే తాను ఐఏఎస్ పదవికి రాజీనామా సమర్పించానని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

గత ఏడాది కాలంగా తాను తీవ్రమైన ఒంటరితనం, తిరస్కరణ వంటి భావనలతో సతమతమయ్యానని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. "వీఆర్ఎస్ తర్వాత విజయవాడలో ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరూ ఒప్పుకోలేదంట కదా?" అని అడిగిన ప్రశ్నకు, అది వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

తన సర్వీసులో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు పలువురు సీనియర్ అధికారులను సంప్రదించానని ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. "నా బ్లైండ్ స్పాట్ ఏమిటి? నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి" అని అడిగినా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా "మీరు కోపంతోనే రాజీనామా ఇచ్చారు కదా?" అని నేరుగా ప్రశ్నించగా, "అవును, కోపంతోనే ఇచ్చాను" అని ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు.

అయితే, గతాన్ని వెనక్కి నెట్టి తాను ఇప్పుడు 'జర్నీ 2.0' ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. తన నిబద్ధత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనని, రాష్ట్ర ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెబుతానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Praveen Prakash
IAS officer
Andhra Pradesh
IAS resignation
Vehmuri Radhakrishna
ABN Andhra Jyothi
Civil Services
Government officer
Vijayawada
Journey 2.0

More Telugu News