నాకేమీ తొందర లేదు, నా తల రాత ఏమిటో నాకు తెలుసు: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్య
- ఈ ఏడాది చివరలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం
- అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్న డీకే శివకుమార్
- ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆశ ఉందని పరోక్షంగా తెలియజేసిన డీకే
తనకేమీ తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు బాగా తెలుసని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కొంతకాలంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరలో ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చనే కథనాలు వస్తుండగా డీకే శివకుమార్ స్పందించారు. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.
అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని డీకే శివకుమార్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే ఆశ ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. నవంబర్ నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.