Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Government to Approach Supreme Court on BC Reservations
  • హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
  • స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం
  • కాంగ్రెస్ నేతల జూమ్ సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది సింఘ్వీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను, ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది. జీవో 9ను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనుంది.

సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో కూడా మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు.
Revanth Reddy
Telangana government
BC reservations
local body elections
High Court
Supreme Court

More Telugu News