Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గౌరవం... ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ అవార్డు

Nara Bhuvaneswari Receives International Honor Prestigious Fellowship Award
  • నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) 2025కు ఎంపిక
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలకు గొప్ప గుర్తింపు
  • నవంబర్ 4న లండన్‌లో అవార్డు ప్రదానం
  • గతంలో ఏపీజే అబ్దుల్ కలాం వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం
  • భువనేశ్వరిని సన్మానించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో నవంబరు 4 తేదీన జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. 

సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా అమెను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. గతంలో ఈ అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ-వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు ఉన్నారు. 

ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావటంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం ఆమెను సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేశారు.
Nara Bhuvaneswari
NTR Trust
Distinguished Fellowship Award 2025
Institute of Directors
Social Empowerment
Public Service
APJ Abdul Kalam
London Global Convention

More Telugu News