Donald Trump: నోబెల్ బహుమతి ప్రకటనకు ముందు రష్యా కీలక నిర్ణయం.. ట్రంప్‌కు మద్దతు

Russia Supports Donald Trump for Nobel Prize Before Announcement
  • ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి
  • బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కీలక ప్రకటన
  • నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు రాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం
నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రష్యా సమర్థిస్తుందని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికారి యురి ఉషకోవ్ ప్రకటన చేశారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది. తన చొరవతో ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాలు ఆగాయని ట్రంప్ పదేపదే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు రాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ముగింపునకు ప్రయత్నించినందుకు ట్రంప్‌పై రష్యా కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలిగితే కీవ్ నోబెల్‌కు నామినేట్ చేస్తుందని అన్నారు.
Donald Trump
Nobel Peace Prize
Russia
Kremlin
US President
Ukraine
Yuri Ushakov

More Telugu News