: పాక్‌కు కొత్త క్షిపణులు లేనట్టే.. వదంతులపై స్పష్టతనిచ్చిన అమెరికా
- పాక్‌కు కొత్తగా అమ్రామ్ క్షిపణులంటూ వచ్చిన వార్తలు
- ఊహాగానాలకు తెరదించిన అమెరికా రాయబార కార్యాలయం
- కొత్త క్షిపణులు ఇవ్వట్లేదని స్పష్టీకరణ
- పాత ఒప్పందానికి సవరణ మాత్రమేనని వెల్లడి
- పాక్ సైనిక సామర్థ్యం పెంచే ఉద్దేశం లేదని తేల్చిచెప్పిన యూఎస్
పాకిస్థాన్‌కు అత్యాధునిక గగనతల క్షిపణులను విక్రయిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అమెరికా స్పష్టత నిచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ దేశానికి కొత్తగా అమ్రామ్ క్షిపణులను అందించడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం పాత ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమేనని వివరించింది.
అమెరికా వార్ డిపార్ట్మెంట్ (డీవోడబ్ల్యూ) సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఓ ఆయుధ కాంట్రాక్టు ప్రకటనతో ఈ గందరగోళం మొదలైంది. సుమారు 251 కోట్ల డాలర్ల విలువైన ఈ కాంట్రాక్టులో క్షిపణులను కొనుగోలు చేసే 35 దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరు కూడా ఉండటంతో, ఆ దేశానికి కొత్తగా ఆయుధాలు అందుతున్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ వార్తలపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. "సెప్టెంబర్ 30న వార్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది ఒక పాత విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమే. పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఇప్పటికే ఉన్న క్షిపణుల నిర్వహణ, విడిభాగాల సరఫరా కోసమే ఈ సవరణ" అని స్పష్టం చేసింది. "ఈ ఒప్పంద సవరణలో భాగంగా పాకిస్థాన్‌కు కొత్తగా ఎలాంటి అమ్రామ్ క్షిపణులను అందించడం లేదు. వారి ప్రస్తుత సైనిక సామర్థ్యాన్ని పెంచే అప్గ్రేడ్లు కూడా ఇందులో లేవు" అని ఆ ప్రకటనలో వివరించింది.
అరిజోనాకు చెందిన రేథియాన్ కంపెనీకి ఈ కాంట్రాక్టును అప్పగించారు. ఈ ఒప్పందంలో పాకిస్థాన్‌తో పాటు బ్రిటన్, జపాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి అనేక దేశాలు ఉన్నాయి. ఈ పనులన్నీ 2030, మే 30 నాటికి పూర్తవుతాయని కాంట్రాక్టు పత్రంలో పేర్కొన్నారు.