Marigallu: నిధి చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ .. 'మారిగల్లు'
- కన్నడ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్
- కదంబరాజుల కాలంలో నడిచే కథ
- నిధి కోసం సాగే అన్వేషణ
- ఈ నెల 31 నుంచి జరగనున్న స్ట్రీమింగ్
కన్నడ నుంచి ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు రావడం మొదలైంది. కన్నడ నుంచి ఆ మధ్య వచ్చిన 'అయ్యనా మానే' సిరీస్ కి విశేషమైన ఆదరణ లభించింది. అత్తాకోడళ్ల నేపథ్యంలో నడిచే ఈ కథ, లొకేషన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల వచ్చిన 'శోధ' సిరీస్ కి కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'మారిగల్లు'.
పునీత్ రాజ్ కుమార్ కి చెందిన బ్యానర్ పై ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, ఈ నెల 31వ తేదీన వివిధ భాషల్లో 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. ముత్తు గణేశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్ లో, ప్రవీణ్ తేజ్ .. ప్రశాంత్ సిద్ధ .. రంగాయన రఘు .. గోపాలకృష్ణ దేశ్ పాండే .. నినాద్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
కథ విషయానికి వస్తే కదంబ రాజుల కాలంలోను .. 1990ల లోను ఈ కథ నడుస్తుంది. కదంబ రాజులు తమ పాలనా కాలంలో అపారమైన నిధిని శత్రువుల కంటపడకుండా దాచారనే ఒక కథ ప్రచారంలో ఉంటుంది. ఆ నిధిని సొంతం చేసుకోవాలనే దురాశతో 1990లలో కొంతమంది బయల్దేరుతారు. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎదురయ్యే అనుభవాలు .. సవాళ్లు మిగిలిన కథ. 6 ఎపిసోడ్స్ గా రానున్న ఈ సిరీస్, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.