Jio Bharat phone: జియో డబుల్ ధమాకా: రూ.799కే సేఫ్టీ ఫోన్లు.. విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు

Jio Bharat Phone Affordable Safety Phones at Rs 799 Free AI Course
  • భద్రతా ఫీచర్లతో కొత్త జియోభారత్ ఫోన్ల ఆవిష్కరణ
  • పిల్లలు, మహిళలు, వృద్ధులే లక్ష్యంగా ఫోన్ల రూపకల్పన
  • కేవలం రూ.799 నుంచే ప్రారంభమవుతున్న ధరలు
  • లొకేషన్ ట్రాకింగ్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు
  • విద్యార్థుల కోసం ఉచితంగా 'జియో ఏఐ క్లాస్‌రూమ్' కోర్సు ప్రకటన
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి మార్కెట్లో సంచలనానికి తెరలేపింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 వేదికగా భద్రతకు పెద్దపీట వేస్తూ కొత్త శ్రేణి 'జియోభారత్' ఫోన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ 'సేఫ్టీ-ఫస్ట్' ఫోన్ల ప్రారంభ ధర కేవలం రూ.799 మాత్రమే కావడం విశేషం. దీంతో పాటు విద్యార్థుల కోసం ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును కూడా ప్రకటించింది.

ఫోన్‌ కీలక ఫీచర్లు ఇవే..
ఈ కొత్త జియోభారత్ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్, యూసేజ్ మేనేజ్‌మెంట్ వంటి కీలక ఫీచర్లను పొందుపరిచారు. లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఫోన్ వాడుతున్న వారు తమ రియల్-టైమ్ లొకేషన్‌ను నమ్మకమైన కాంటాక్ట్స్‌తో పంచుకోవచ్చు. ఇక 'యూసేజ్ మేనేజర్' టూల్ ద్వారా పిల్లలు లేదా వృద్ధుల ఫోన్‌కు ఎవరెవరు కాల్ చేయాలి, మెసేజ్ పంపాలి అనే దానిపై సంరక్షకులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీనివల్ల గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ రావడం ఈ ఫోన్ల మరో ప్రత్యేకత.

ఈ ఫోన్లు జియో స్టోర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అనవసరమైన కాల్స్, సోషల్ మీడియా వంటి వాటి నుంచి తమ ఆత్మీయులను దూరంగా ఉంచాలనుకునే కుటుంబాలకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని జియో పేర్కొంది.

'జియో ఏఐ క్లాస్‌రూమ్' పేరిట‌ ఉచిత ఫౌండేషన్ కోర్సు
ఇదే కార్యక్రమంలో జియో మరో కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానాన్ని పెంచే లక్ష్యంతో 'జియో ఏఐ క్లాస్‌రూమ్' పేరుతో ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. జియో ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రూపొందించిన ఈ కోర్సును జియోపీసీ ద్వారా పీసీలు, ల్యాప్‌టాప్‌లు, జియో సెట్-టాప్ బాక్సుల సహాయంతో స్మార్ట్ టీవీల్లో యాక్సెస్ చేయవచ్చు. నాలుగు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఏఐ ప్రాథమిక అంశాలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్‌తో పాటు, జియోపీసీ యూజర్లకు జియో ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ కూడా అందిస్తారు.

Jio Bharat phone
Jio
Reliance Jio
safety phone
location tracking
usage management
AI course
Jio AI Classroom
free AI course
IMC 2025

More Telugu News