Peddi: రామ్‌చరణ్ 'పెద్ది' నుంచి క్రేజీ న్యూస్.. ఆ పాట షూటింగ్ రేపే!

Ram Charan and Janhvi Kapoor to Dance in Peddi Song
  • 'పెద్ది' స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో
  • ఏఆర్ రెహమాన్ సంగీతం.. చరణ్, జాన్వీలపై చిత్రీకరణ
  • ఇప్పటికే 60 శాతం పూర్తయిన సినిమా షూటింగ్
  • కొత్త యాస, రగ్డ్ లుక్‌తో కనిపించనున్న చెర్రీ
  • 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ రేప‌టి నుంచి పూణెలో మొదలుకానుంది. ఈ పాటలో రామ్‌చరణ్‌తో కలిసి జాన్వీ కపూర్ స్టెప్పులేయనున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను మెలోడీ, ఎనర్జీ కలగలిసిన ట్యూన్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ గ్రేస్, జాన్వీతో ఆయన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఈ పాట కీలకంగా ఉండనుందని సమాచారం.

ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్‌..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగం ఎడిటింగ్ పనులు కూడా నవీన్ నూలి దాదాపు పూర్తి చేశారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. పెరిగిన గడ్డం, మీసాలతో పాటు ముక్కు రింగ్‌తో ఆయన గెటప్ చాలా ప్రత్యేకంగా ఉండనుంది.

ఈ సినిమాపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ, "బుచ్చి బాబు రాసిన కథ అద్భుతంగా ఉంది. 'రంగస్థలం' నుంచి కొంత స్ఫూర్తి ఉన్నప్పటికీ, 'పెద్ది' కథ పూర్తిగా కొత్తది. ఇది ఏ సినిమాను పోలి ఉండదు. ఈ పాత్ర కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాసను ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Peddi
Ram Charan
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Pune
Jhonny Master
Ratnavelu
Sports Action Drama
Telugu Movie

More Telugu News