KTR: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పడుతుంది: కేటీఆర్, హరీశ్ రావు

KTR says BRS win in Jubilee Hills will check government
  • ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీశ్ రావు దిశానిర్దేశనం
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
  • ఎన్నికల ఇన్‌ఛార్జిలు సమన్వయంతో పనిచేయాలని సూచన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీశ్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అన్నారు. దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జిలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎవరికి అప్పగించిన పనులకు వారు పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలని తెలిపారు.

బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్రలు చేపట్టాలని అన్నారు. బూత్ కమిటీలు నిరంతరం ఓటర్లతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆకాంక్షించారు. ప్రచారం చివరి దశలో రోడ్డు షోలు నిర్వహించాలని నిర్ణయించారు.
KTR
BRS
Jubilee Hills
Telangana Politics
Harish Rao
Maganti Sunitha
By Election

More Telugu News