Senior Heroines: తెలుగు తెరపై సీనియర్ హీరోయిన్స్ జాడ లేదే!

Senior Heroines Special
  • త్రివిక్రమ్ సెట్ చేసిన ట్రెండ్ 
  • కీలకమైన పాత్రలలో సీనియర్ హీరోయిన్స్ 
  • ఒక దశలో వారికి జోరుగా దక్కిన ఛాన్సులు 
  • మళ్లీ మారిపోయిన తీరు  

ఒకప్పుడు అటు హీరోకి అయినా, ఇటు హీరోయిన్ కైనా తల్లి పాత్రలు .. అత్త పాత్రలు చేయాలంటే నిర్మలమ్మ  .. అన్నపూర్ణమ్మ ముందుగా గుర్తుకొచ్చేవారు. ఆ తరువాత కాలంలో శారద .. వాణిశ్రీ .. అమ్మపాత్రలపై .. అత్తపాత్రలపై తమదైన మార్క్ వేశారు. కొంతకాలం తరువాత అలాంటి పాత్రలు తెరపై కనిపించకుండా పోయాయి. హీరో తల్లిదండ్రులు .. హీరోయిన్ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోయారనే ఒక్క డైలాగ్ తో నాలుగు పాత్రలను లేపేయడం మొదలైంది. తల్లిదండ్రులు లేకుండా ఇంత అందంగా .. ఆరోగ్యంగా ఎలా పెరిగారని ఆలోచించే సమయం ఆడియన్స్ కి లేదు.ఆ సంగతి అలా ఉంచితే, అందమైన అమ్మలుగా .. అత్తలుగా .. వదినలుగా సీనియర్ హీరోయిన్స్ ను తెరపైకి తీసుకు రావడంలో త్రివిక్రమ్ ఎక్కువ చొరవ చూపించడం కనిపిస్తుంది. ఆ తరువాత మరికొందరు దర్శకులు అదే పద్ధతిని పాటిస్తూ వెళ్లారు. ఆ సమయంలోనే సీనియర్ హీరోయిన్స్ చాలామంది మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ జాబితాలో రమ్యకృష్ణ .. సుహాసిని .. భానుప్రియ .. నదియా .. స్నేహ .. భూమిక .. ఆమని .. సంగీత .. ఇలా చాలామంది బిజీ అయ్యారు.కానీ ఇది ఎంతో కాలం నడవలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ఈ తరహా పాత్రలు గానీ .. ఆ పాత్రలలో సీనియర్ హీరోయిన్స్ గాని కనిపించడం లేదు. మళ్లీ అలాంటి ఒక వాతావరణం తెరపై కనిపించాలంటే, త్రివిక్రమ్ .. బోయపాటి .. కృష్ణవంశీ రంగంలోకి దిగవలిసిందేనని అనిపిస్తోంది. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ ఇలా తెరపైకి వచ్చి అలా మాయం కావడం అభిమానులకు నిరాశను కలిగించే విషయమేనని చెప్పాలి.

Senior Heroines
Telugu cinema
Tollywood
Trivikram Srinivas
Boyapati Srinu
Krishna Vamsi
Ramya Krishna
Nadia
Bhoomika Chawla

More Telugu News