Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతులకు హైకోర్టు షాక్.. విదేశాలకు వెళ్లాలంటే 60 కోట్లు కట్టాల్సిందే!

Shilpa Shetty Denied Foreign Travel Without 60 Crore Deposit
  • రూ.60 కోట్ల మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి దంపతులు
  • వీరిపై ముంబయి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ
  • విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్
  • పిటిషన్‌ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్తకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దంపతులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా, న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలనుకుంటే, ముందుగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.60 కోట్లను డిపాజిట్ చేయాలని కఠిన షరతు విధించింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాతే వారి విజ్ఞప్తిపై తదుపరి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే, శిల్పాశెట్టి దంపతులపై రూ.60 కోట్ల ఆర్థిక మోసం కేసు విచారణలో ఉంది. ఈ కేసు నేపథ్యంలో ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వీరికి వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేసింది. దీంతో వారు దేశం విడిచి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.

అయితే, ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమం కోసం శిల్పాశెట్టి అక్టోబరు 25 నుంచి 29 వరకు కొలంబో వెళ్లాల్సి ఉంది. లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో, ప్రయాణానికి అనుమతి కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, "ఈవెంట్ నిర్వాహకుల నుంచి అధికారిక ఆహ్వానం ఏమైనా ఉందా?" అని న్యాయస్థానం శిల్పాశెట్టి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఫోన్ కాల్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని, కోర్టు అనుమతి ఇస్తే అధికారిక ఆహ్వానం వస్తుందని న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతు విధిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
Shilpa Shetty
Shilpa Shetty Kundra
Raj Kundra
Bombay High Court
Economic Offenses Wing
EOW
Lookout Circular
Financial Fraud
Colombo
Bollywood

More Telugu News