Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో కీలక మలుపు.. గాయకుడి కజిన్ అరెస్టు

Zubeen Garg cousin Sandeep Garg arrested in death case
  • అసోం పోలీస్ అధికారి సందీపన్ గార్గ్ అరెస్టు
  • జుబీన్ గార్గ్ మృతి సమయంలో ఆయన వెంటే ఉన్న సందీపన్
  • వరుస విచారణల అనంతరం సందీపన్ అరెస్టు
అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో ఆయన కజిన్, అసోం పోలీస్ సర్వీస్ అధికారి సందీపన్ గార్గ్‌ను అరెస్టు చేశారు. జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

జుబీన్ గార్గ్ మృతి చెందిన సమయంలో సందీపన్ ఆయనతోనే ఉన్నారు. ఈ మృతిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ వరుస విచారణలు జరిపిన అనంతరం సందీపన్‌ను అదుపులోకి తీసుకుంది. జుబీన్ గార్గ్ ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించగా, వారి ఖాతాల్లో దాదాపు రూ. 1 కోటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. గార్గ్ మరణంలో వారి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్ట్ కోసం జుబీన్ గత నెలలో సింగపూర్ వెళ్లారు. సెప్టెంబర్ 19న యాట్ పార్టీలో భాగంగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. జుబీన్ సింగపూర్ వెళ్లినప్పుడు సందీపన్ ఆయన వెంటే ఉన్నారని, యాట్ పార్టీలో కూడా పాల్గొన్నారని, జుబీన్ మృతి తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులను కూడా స్వదేశానికి తీసుకువచ్చాడని పోలీసులు వెల్లడించారు.

సందీపన్‌ను ఐదు రోజుల పాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు అసోం సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా గుప్తా తెలిపారు. సందీపన్ అసోం పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జుబీన్ బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకుడు అమృత్‌ప్రవ మహంత, మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ మేనేజర్ శ్యాంకను మహంత కూడా ఉన్నారు. జుబీన్‌కు సమీపంలో గోస్వామి ఈత కొడుతుండగా, మహంత వీడియో తీశాడు.

బ్యాండ్‌మేట్ సంచలన ఆరోపణలు

జుబీన్‌కు విషమిచ్చి చంపి ఉంటారని బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడి సిద్ధార్థ శర్మ, ఫెస్టివెల్ ఆర్గనైజర్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. జుబీన్ మునిగిపోతున్న సమయంలోనూ, 'అతనిని వెళ్లనివ్వండి' అంటూ శర్మ అరవడం తనకు వినిపించిందని గోస్వామి వెల్లడించారు. జబీన్ గార్గ్ శిక్షణ పొందిన ఈతగాడని, తనతో పాటు ఎంతోమందికి ఈతలో కోచింగ్ ఇచ్చారని అన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ మహంత ఆర్థిక వ్యవహారాల పైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహంత గతంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అసోం సీఐడీ పోలీసులు తెలిపారు.
Zubeen Garg
Zubeen Garg death
Sandeep Garg
Assam police
North East India Festival
Singapore death case

More Telugu News