Addluri Lakshman Kumar: పీసీసీ చీఫ్ నివాసంలో అడ్లూరి, పొన్నం భేటీ.. సారీ చెప్పిన పొన్నం

Ponnam Prabhakar Apologizes to Addluri Lakshman Kumar
  • అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం వ్యాఖ్యల వివాదం
  • ఇరువురినీ ఇంటికి పిలిపించుకున్న మహేశ్ గౌడ్ 
  • పొన్నం క్షమాపణ చెప్పడంతో సమసిన వివాదం
తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీనికి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వడమూ విదితమే.

ఈ వివాదం కాస్తా ముదురుతుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రులు ఇద్దరినీ తన నివాసానికి ఆహ్వానించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. బుధవారం ఉదయం మహేశ్ గౌడ్ నివాసంలో భేటీ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఆ వ్యాఖ్యలు చేయకపోయినా, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారు. అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నాను. అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదు’’ అని అన్నారు.
Addluri Lakshman Kumar
Ponnam Prabhakar
Telangana Ministers
Mahesh Kumar Goud
Jubilee Hills by-election
Congress Party Telangana
Telangana Politics
Political Dispute Resolution

More Telugu News