Tumakuru: పిక్నిక్ కోసమని వెళ్లి డ్యామ్​ లో ఆరుగురి గల్లంతు.. కర్ణాటకలో దారుణం

Tumakuru Dam Tragedy Six Drown During Picnic in Karnataka
ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే నీటిని వదిలిన సిబ్బంది
  • అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయిన జనం
  • గల్లంతైన వారికోసం గాలిస్తున్న సహాయక బృందాలు
విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది. సరదాగా గడిపేందుకు డ్యామ్ వద్దకు వెళ్లిన ఆ కుటుంబంలో ఏడుగురు నీటిలో కొట్టుకుపోయారు. సహాయక బృందాలు వెంటనే స్పందించి ఓ వ్యక్తిని కాపాడాయి. నీళ్లలో నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. మంగళవారం కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఈ దారుణం వివరాలు..
 
తుమకూరుకు చెందిన ఓ కుటుంబం కలిసి మార్కొనహళ్లి డ్యామ్ వద్దకు పిక్నిక్ కు వెళ్లింది. పిల్లాపాపలతో కలిసి మొత్తం పదిహేను మంది వెళ్లగా.. అందులో ఏడుగురు నీళ్లలో దిగి ఆటలాడుతున్నారు. ఇంతలో ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే డ్యామ్ అధికారులు సడెన్ గా నీళ్లు వదిలారు. దీంతో నీటి ఉద్ధృతి పెరిగి ఏడుగురూ కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సహాయక బృందాలతో కలిసి నవాజ్ అనే వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారి కోసం నీళ్లలో వెతుకుతుండగా రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నామని, ఈ రోజు ఉదయం వరకు కూడా వారి ఆచూకీ లభ్యంకాలేదని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారంతా మహిళలు, పిల్లలేనని వారు పేర్కొన్నారు.
Tumakuru
Karnataka news
Markonahalli dam
dam accident
picnic tragedy
drowning incident
rescue operation
water release
family tragedy

More Telugu News