సీజేఐ గవాయ్‌పై బూటుతో దాడికి యత్నం.. స్పందించిన కేటీఆర్

  • దేశంలో అసహనం అత్యున్నతస్థాయికి చేరుకుందన్న కేటీఆర్
  • ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు అన్న కేటీఆర్
  • ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు.. వ్యవస్థపై జరిగిన దాడి అన్న కేటీఆర్
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌పై ఓ న్యాయవాది బూటుతో దాడికి ప్రయత్నించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు అని అన్నారు.

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి, అసహనం పెరిగిందనడానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది వ్యవస్థపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు.

విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా హింసను సమర్థించకూడదని అన్నారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు కలిగిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది చెప్పుతో దాడికి యత్నించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.


More Telugu News