Trisha: త్రిష కెరియర్ ను 'విశ్వంభర' పరిగెత్తిస్తుందా?

Trisha Special
  • కెరియర్ పరంగా పుంజుకున్న త్రిష 
  • గ్లామర్ పరంగా దక్కిన మంచి మార్కులు 
  • అందకుండా పోతున్న విజయాలు 
  •  ఆ రెండు సినిమాలపైనే ఆశలు 

త్రిష .. దాదాపు పాతికేళ్ల కెరియర్ ను చూసిన నాయిక. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ డమ్ ను చూసిన బ్యూటీ. అలాంటి త్రిషకి ఆ మధ్య కాలంలో అవకాశాలు తగ్గుతూ వెళ్లాయి. ఆ సమయంలో ఆమె నాయికా ప్రధానమైన కథలను చేస్తూ వెళ్లింది. ఆ క్రమంలో 'రాంగీ' .. 'ది రోడ్' .. '96' వంటి సినిమాలు ఆమె కెరియర్ ను మరికాస్త ముందుకు నడిపించాయి. ఈ నేపథ్యంలోనే త్రిషను సినిమా ఫంక్షన్ కి సంబంధించిన ఒక వేదికపై చూసి అందరూ షాక్ అయ్యారు. అందుకు కారణం గతంలో కంటే ఆమె ఇప్పుడు మరింత గ్లామరస్ గా ఉండటమే. 

త్రిష గురించి .. ఆమె గ్లామర్ గురించి సోషల్ మీడియాలో సందడి సాగింది. దాంతో ఆమెకి మళ్లీ పెద్ద బ్యానర్ల నుంచి .. సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి కాల్స్ వెళ్లడం మొదలైంది. అలా ఆమె రజనీకాంత్ .. కమల్ వంటి సీనియర్ స్టార్స్  సరసన .. విజయ్ - అజిత్ వంటి స్టార్స్ జోడీగా మెరిసింది. గ్లామర్ పరంగా త్రిష ఆ సినిమాలకి చాలా హెల్ప్ అయింది. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది. 

ఈ క్రమంలోనే తమిళంలో ఆమె సూర్య సినిమా 'కరుప్పు'లో నటిస్తోంది. ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తెలుగులో ఆమె చిరంజీవి సరసన 'విశ్వంభర'లో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  ఈ వయసులోను గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన త్రిషకు ఇప్పుడు ఒక పెద్ద హిట్ అవసరం. ఆమె కోరుకుంటున్న విజయాన్ని 'విశ్వంభర' అందిస్తుందా? ఆమె కెరియర్ ను పరిగెత్తిస్తుందా? అనేది చూడాలి. 


Trisha
Trisha Krishnan
Vishwambhara
Chiranjeevi
Tamil cinema
Telugu cinema
Kollywood
Tollywood
Actress
South Indian movies

More Telugu News