Anu Emmanuel: అందాన్ని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టం!

Anu Emmanuel Special
  • 'మజ్ను'తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన కళ్లు  
  • కుర్రకారు వైపు నుంచి ఫుల్ క్రేజ్ 
  • పెద్ద సినిమాలతోను దక్కని ఫలితం 
  • వెనకబడిపోయిన సుందరి  

ఇప్పుడంటే రాన్రాను తెరపై కథానాయికలకు చోటు లేకుండా పోతోందిగానీ, ఒకప్పుడు ముగ్గురేసి హీరోయిన్స్ సందడి చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ ముగ్గురి వైపు నుంచి చూపించలేని గ్లామర్ ను కొసరు వేయడానికి ఓ ఐటమ్ గాళ్ కావలసి వచ్చేది. ఎందుకంటే సినిమాకి కథాకథనాలు ఎంత అవసరమో, గ్లామర్ కూడా అంతే అవసరమని భావించేవారు. వాళ్ల అభిప్రాయం సరైనదేనని మాస్ ఆడియన్స్ నిరూపించేవారు.అయితే ఆ మధ్య కాలంలో ఓ అందాల హీరోయిన్ తెరపై తెల్ల కలువలా విరిసింది. విశాలమైన కళ్లతో .. విరుగుడు లేని చూపులతో కుర్రకారు ప్రేక్షకులకు కునుకు లేకుండా చేసింది. చక్కని కనుముక్కుతీరుతో వెండితెరకు వెలుగు తీసుకొచ్చిన బ్యూటీగా ఆమెను గురించి చెప్పుకున్నారు. ఆ సుందరి పేరే అనూ ఇమ్మాన్యుయేల్. అనూ లోని ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెకి వరుస అవకాశాలు దక్కేలా చేశాయి. దాంతో ఈ బ్యూటీ ఒక రేంజ్ లో దూసుకెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. నాని 'మజ్ను'తో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, 'అజ్ఞాతవాసి' .. 'నా పేరు సూర్య' సినిమాలతో టాప్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్లిపోతుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఆ సినిమాలు మాత్రమే కాదు, ఆ తరువాత చేసినవి కూడా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఈ కోల కళ్ల భామ పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదృష్టం ఎదురుపడితే అమ్మడు తప్పుకుపోయిందా? లేదంటే అదృష్టమే తప్పించుకుని పోయిందా? అనేదే అభిమానులకు అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. 

Anu Emmanuel
Anu Emmanuel movies
Telugu actress
Majnu movie
Agnyaathavaasi movie
Naa Peru Surya
Telugu cinema
Tollywood actress
Telugu film industry
Indian actress

More Telugu News