Rinku Singh: సోదరికి స్కూటీని గిఫ్ట్ గా ఇచ్చిన క్రికెటర్ రింకూ సింగ్

Rinku Singh gifts electric scooter to sister Neha Singh
  • ఈ ఏడాది మొదట్లో తండ్రికి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చిన రింకూ
  • అలీగఢ్ లో తల్లి పేరుతో ఖరీదైన భవనం కొనుగోలు
  • రింకూ తన మూలాలు మర్చిపోలేదంటున్న అభిమానులు
టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ తన సోదరి నేహా సింగ్ కు సరికొత్త స్కూటీని బహుమతిగా అందించాడు. దాదాపు రూ. లక్ష విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను బహుమతిగా అందుకున్నానని నేహా సింగ్ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. స్కూటీకి పూజ చేసి, పక్కనే సోదరుడు రింకూ సింగ్ తో కలిసి ఫొటో దిగిన నేహా.. ఆ ఫొటోను ఇన్ స్టాలో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా రింకూకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. కాగా, పేద కుటుంబంలో నుంచి క్రికెటర్ గా ఎదిగిన రింకూ సింగ్ ఇప్పటికీ తన మూలాలు మర్చిపోలేదని ఆయన అభిమానులు చెబుతుంటారు. రింకూ ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్ ఉంటారని మెచ్చుకుంటారు. ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ లో వీరి వివాహం జరగాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడినట్లు సమాచారం.

ఈ ఏడాది ప్రారంభంలో తన తండ్రి ఖాంచంద్ సింగ్ కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చి రింకూ సింగ్ ఆయనను ఆశ్చర్యపరిచాడు. రూ. 3.19 లక్షల విలువైన కవాసకి నింజా బైక్ ను తండ్రికి కొనిచ్చాడు. ఖాంచంద్ సింగ్ ఆ బైక్ పై రైడ్ చేస్తున్న వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. ఇటీవల అలీగఢ్ లో ఖరీదైన మూడంతస్తుల భవనం కొనుగోలు చేసిన రింకూ సింగ్.. ఆ భవనానికి వీణా ప్యాలెస్ అని పేరు పెట్టి తన తల్లిపై ప్రేమను చాటుకున్నాడు. ఈ భవనం కోసం రింకూ సింగ్ రూ.3.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.

Rinku Singh
Neha Singh
Indian cricketer
scooty gift
electric scooter
Veena Palace
Khanchand Singh
Kawsaki Ninja
Priya Saroj
Samajwadi Party

More Telugu News