Vijay Deverakonda: నేను బాగానే ఉన్నాను: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Safe After Car Accident Assures Fans
  • ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, అంతా సురక్షితమని వెల్లడి
  • సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షేమ సమాచారం అందించిన విజయ్
  • ప్రమాదం తర్వాత కూడా జిమ్‌లో వర్కౌట్ చేశానని తెలిపిన రౌడీ హీరో
  • వార్తలు చూసి కంగారు పడొద్దని అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి
టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒక రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పటికీ, తనతో పాటు ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన ప్రత్యేకంగా కోరారు.

సోమవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "నాకేం కాలేదు... అంతా బాగానే ఉంది. మా కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్‌లో స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా పూర్తిచేశాను. కాస్త తలనొప్పిగా ఉంది, కానీ దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి" అంటూ తనదైన శైలిలో అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్‌తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పుట్టపర్తి నుంచి తిరిగొస్తుండగా, జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారుకు స్వల్ప డ్యామేజి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన మరో వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
Vijay Deverakonda
Vijay Deverakonda accident
Telugu actor
car accident
Jogulamba Gadwal district
Telangana news
Tollywood news
Road accident

More Telugu News