రాయదుర్గంలో ఎకరా భూమి రూ. 177 కోట్లు.. దక్కించుకున్న రియాల్టీ సంస్థ
- నాలెడ్జ్ సిటీలో ఎకరా రూ. 177 కోట్లతో సరికొత్త రికార్డు
- వేలంలో 7.6 ఎకరాలను దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ
- మొత్తం రూ. 1357 కోట్లకు భూమిని చేజిక్కించుకున్న సంస్థ
ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున 7.6 ఎకరాలను దక్కించుకుంది. మొత్తం రూ. 1,357 కోట్లకు ఈ భూమిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లో చదరపు గజం రూ. 1.14 లక్షలకు అమ్ముడుపోయింది.